![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి మరింత ఆసక్తిని కలిగిస్తుంది. దానికి కారణం నామినేషన్లు. సీరియల్ బ్యాచ్ అంతా కలిసి సరిగ్గా డిఫెండ్ కూడా చేసుకోలేని భోలే షావలిని నామినేట్ చేశారు. అందరితో కలిసిపోవాలనుకున్న భోలే షావలి మాటతీరు, ఆటతీరుని సవాల్ చేస్తూ ప్రియాంక, శోభా శెట్టి ఇద్ధరు నామినేట్ చేయగా అతను తిరిగి వాళ్ళిద్దరిని నామినేట్ చేశాడు. దాంతో టాక్ ఆఫ్ ది వీక్ గా భోలే షావలి నిలిచాడు.
సోమవారం నుండి హౌస్ లో హీటెడ్ నామినేషన్లు జరుగుతున్నాయి. అయితే ఇందులో ఒక్కో కంటెస్టెంట్ చేసే నామినేషన్ చాలా కీలకం. ఎందుకంటే వారు చేసే నామినేషన్ వల్లనే హౌస్ లోని వ్యక్తి బయటకు వస్తారు.మొన్నటి నుండి సాగుతున్న నామినేషన్లో అందరు కలిసి భోలే షావలిని నామినేట్ చేశారు. ఎంతో ఓపికగా ఉండే భోలే షావలికి కూడా చిరాకు తెప్పించారు ఈ సీరియల్ బ్యాచ్. శోభా శెట్టి నామినేషన్ చేస్తున్నప్పుడు ప్రియాంక జైన్ మధ్యలో వచ్చి మాడ్లాడటాన్ని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
దానికి కారణం ఏంటంటే.. నిన్న ప్రియాంక జైన్, భోలే షావలి మధ్య నామినేషన్ ప్రక్రియలో చాలా వాగ్వాదం జరిగింది. అయితే భోలే ఎంతో సానుకూలంగా స్పందించాడు. అయితే సీరియల్ బ్యాచ్ మాత్రం అతడిని టార్గెట్ చేశారు. ఒక అమ్మాయి పక్కన ఉన్నప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని భోలే షావలిని శోభా శెట్టి అనగా.. నువ్వు మోనితవి శోభావి కాదని భోలే అన్నాడు. ఆ తర్వాత మధ్యలోకి వచ్చిన ప్రియాంక.. థూ.. అంతా యాక్టింగ్ అని అంది. ఇన్ని రోజులో మీతో నవ్వుతుంటే ఇలా అర్థం చేసుకుంటారా, నువ్వు నన్ను థూ అని అన్నావ్, నేను తిరిగి థూ అని అంటే నీ బతుకేం కావాలే అని భోలే అన్నాడు. అయితే ఈ నామినేషన్ లో ప్రియాంక థూ అని ఒక హౌజ్ మేట్ ని అనడం ఎంత వరకు కరెక్ట్ అంటూ తనపై విమర్శలు వస్తున్నాయి.
ప్రియాంక, శోభా శెట్టి ఇద్దరు కలిసి భోలే షావలని నామినేట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే భోలే షావలి ఏ రోజు ఆడవాళ్ళని గౌరవం లేకుండా, తక్కువ చేసి మాట్లాడలేదు. అలాంటి అతడిని ప్రియాంక జైన్ థూ అనడంతో తనకి నెగెటివెటివి పెరిగింది. శోభా శెట్టి, ప్రియాంక జైన్ నామినేషన్లో చెప్పిన చెత్త రీజన్లని నెటిజన్లు సవాల్ చేస్తూ వాళ్ళిద్దరివి తుప్పాస్ రీజన్లని కామెంట్లు చేస్తున్నారు.
![]() |
![]() |